Sun Mar 15 2026 15:03:51 GMT+0530 (India Standard Time)
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట
సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన ఆస్తుల కేసు పిటీషన్ ను సుప్రీంకోర్టులో కొట్టివేశారు.

సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఆయన ఆస్తుల కేసు పిటీషన్ ను సుప్రీంకోర్టులో కొట్టివేశారు. చంద్రబాబు ఆస్తులపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని లక్ష్మీపార్వతి పిటీషన్ దాఖలు చేశారు.
ఆస్తుల విచారణ పిటీషన్ ను...
అయితే సుప్రీంకోర్టు ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించి ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరంటూ ప్రశ్నించింది. హైకోర్టు అన్ని విధాలుగా ఆలోచించి ఈ పిటీషన్ ను కొట్టివేసిందని, ఎవరి ఆస్తలు ఎవరికి తెలియాలి? లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదంటూ ఆమె వేసిన పిటీషన్ ను కొట్టి వేసింది.
Next Story

