Mon Jan 20 2025 08:42:37 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : జగన్ కు ఓటేశారో ఇక అంతే
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగ్గంపేటలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ కు మరోసారి ఓటేస్తే ఇక రాష్ట్రం మరో ముప్పయి ఏళ్లు వెనక్కు పోతుందన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్ తాను ఇచ్చిన మాటను ఎప్పుడైనా నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టి ఒక్క పరిశ్రమను కూడా తేలేదని, యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారన్నారు. నాసిరకం మద్యాన్ని తీసుకు వచ్చి ఎందరో ఆడపడచుల కాపురాలను నాశనం చేశారన్నారు.
నాసిరకం మద్యంతో...
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన ఈ జగన్ కు బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్ లేకుండా చేసి ఆ డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు తరలించారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. మద్యం నిషేధం చేస్తానని గత ఎన్నికల్లో చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం చేసింది ఈ జగన్ మాత్రమేనని అన్నారు. జగన్ ను ఈ ఎన్నికల్లో ఓడించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Next Story