Sat Mar 21 2026 21:26:45 GMT+0530 (India Standard Time)
గొప్పలు ఆపి.. ముందు నీళ్లు ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్లర్ లో విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ట్విట్లర్ లో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు తమ గొప్పలను ఆపి మంగళగిరి ఎయిమ్స్ కు నీళ్లు తరలించాలని ఆయన కోరారు. ఎయిమ్స్ లో నీటి సరఫరా లేక సిబ్బంది, రోగుుల ఇబ్బంది పడుతున్నారన్నారు. కనీసం నీటి వసతిని కూడా కల్పించలేని ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు.
అసమర్థ ప్రభుత్వం...
ఎయిమ్స్ అధికారులు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదన్నారు. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. ఎయిమ్స్ కు నీటి వసతిపై కేంద్ర మంత్రులు ప్రశ్నించినా జగన్ సమాధానం చెప్పకపోగా, మెడికల్ కళాశాలలన్నింటినీ తానే తెచ్చామని అసెంబ్లీలో అసత్య ప్రచారం చేసుకోవడం దారుణమని చంద్రబాబు మండి పడ్డారు
Next Story

