Mon Mar 16 2026 02:24:36 GMT+0530 (India Standard Time)
డీజీపీకి చంద్రబాబు ఫోన్
డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. మాచర్లలో జరిగిన ఘటనకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. మాచర్లలో జరిగిన ఘటనకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. టీడీపీ నేతల వాహనాలను, ఇళ్లను, పార్టీ కార్యాలయాన్ని వైసీపీ అల్లరి మూకలు తగులబెడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మూల్యం చెల్లించుకోక...
పరిస్థితులు అదుపుతప్పినా పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆయన అన్నారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరో పోలీసులకు తెలుసునని, అయినా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీని కోరారు. భవిష్యత్ లో వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Next Story

