Fri Dec 26 2025 20:30:22 GMT+0000 (Coordinated Universal Time)
పొరపాటు చేస్తే కరెక్ట్ బటన్ నేనే నొక్కుతా
175 నియోజకవర్గాల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు

175 నియోజకవర్గాల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. ప్రజలకు సేవ చేస్తే వాలంటీర్లకు సహకరిస్తామన్నారు. నెల్లూరు జోనల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరులో కోర్టుల్లో ఫైల్స్ కూడా మాయం చేస్తున్నారని చంద్రబాబు విమర్శలు చేశారు. వైసీపీ నేతలు కరుడుగట్టిన నేరస్తులుగా తయారయ్యారన్నారు. ఒక్కొక్కరూ ఆర్థిక ఉగ్రవాదులుగా తయారయ్యారన్నారు. వెంకటాచలం మండలంలో రూ.400 కోట్ల భూ కుంభకోణం జరిగిందని, చిల్లకూరులో రూ.200 ఎకరాల భూ రికార్డులు మాయమయ్యాయని చంద్రబాబు ఫైర్ అయ్యారు.
అంతా అవినీతే...
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు గట్టిగా పోరాడారని చంద్రబాబు అభినందించారు. భూములు అమ్మాలన్నా, కొనాలన్నా వీళ్ల పర్మిషన్ కావాలా? అని నిలదీశారు. కావలి ఎమ్మెల్యే పేదల ఇళ్లలో అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. పేదలకు ఇచ్చే ఇళ్లలో రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి మొత్తం బొక్కేశారన్నారు. పలమనేరు ఎమ్మెల్యే గ్రానైట్ పరిశ్రమను దోచుకుంటున్నారని, సీఎం తిమింగలమైతే.. వైసీపీ ఎమ్మెల్యేలు చిన్న తిమింగలాలుగా మారారని చంద్రబాబు విమర్శించారు. ఎవరు పొరపాటు చేసినా, కరెక్ట్ చేసే బటన్ తన చేతిలో ఉందన్న చంద్రబాబు చనిపోయిన కార్యకర్తల పిల్లల కోసం స్కూల్ నడుపుతున్నామని, టెక్నాలజీ అంటే తానే గుర్తుకొస్తానని, తాము తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రంపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో తెలుగువారు రాణిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
Next Story

