Thu Mar 19 2026 08:21:42 GMT+0530 (India Standard Time)
రేపు మరోసారి ఢిల్లీకి చంద్రబాబు, పవన్
రేపు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు

రేపు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పార్లమెంటరీ భేటీ తర్వాత జరిగే ఎన్డీఏ సమావేశంలో ఇద్దరూ పాల్గొననున్ారు. ఎన్డీఏ కూటమి సమావేశానికి పార్టీ అగ్రనేతలతో పాటు పార్లమెంటు సభ్యులందరూ హాజరు కావాలని బీజేపీ నిర్ణయించింది. రేపు ఎన్డీఏ నేతలు అందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలసి తాము మోదీకి మద్దతు ప్రకటించే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
9వ తేదీన...
ఈ నెల 9వ తేదీన మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మోదీని ప్రధానిగా నిర్ణయిస్తూ భాగస్వామ్య పక్షాలన్నీ అంగీకరిస్తూ లేఖలను అందించడంతో నేరుగా రాష్ట్రపతిని కలుసుకుని కూడా చెప్పాలని నిర్ణయించాయి. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని రాష్ట్రపతికి వివరించనున్నారు. అందుకోసమే రేపు ఢిల్లీలో మరోసారి ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి పదవులకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశముంది.
Next Story

