Mon Dec 08 2025 16:58:47 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరి పర్యటనలు వాయిదా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తమ బహిరంగ సభలను వాయిదా వేసుకున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తమ బహిరంగ సభలను వాయిదా వేసుకున్నారు. పొత్తులో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో దానిపైనే కసరత్తులు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఇద్దరు నేతలు బహిరంగ సభలు ముందుగానే ప్రకటించాయి. అనకాపల్లిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ ఉంటుందని పార్టీ నేతలు ప్రకటించుకున్నారు.
నాలుగో తేదీ నుంచి...
నాలుగో తేదీ నుంచి రా కదిలిరా సభలను తిరిగి నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. కానీ పొత్తులపై క్లారిటీ రాకపోవడంతో తమ పర్యటనలు వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్‌లోనే కూర్చుని పొత్తులు, సీట్ల సర్దుబాటుతో పాటు బీజపీ తమ కూటమిలో చేరుతుందా? లేదా? అన్న దానిపై క్లారిటీ వచ్చిన తర్వాతనే జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Next Story

