Tue Jan 14 2025 20:00:26 GMT+0000 (Coordinated Universal Time)
తిక్కలోడికి ఓటేస్తే రాజధాని లేకుండా చేశారు : చంద్రబాబు
తాడికొండలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు
తిక్కలోడికి ఓటేస్తే అసలు ఏపీకి రాజధాని లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాడికొండలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అడిగితే ప్రజలు మోసపోయారన్నారు. ఎంత మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ప్రజలు గెలవాలి.. జగన్ పోవాలి అని పిలుపు నిచ్చారు. జూన్ 4వ తేదీన జగనాసుర వధ జరగాలన్నారు. అప్పుడే ఏపీ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
మూడు ప్రాంతాల అభివృద్ధి...
అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన తెలిపారు. తాము అధికారంలోకి వస్తే అమరావతిని నిర్మించడమే కాదు.. విశాఖ, కర్నూలును కూడా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరగాలంటే కూటమిని గెలిపించాలని కోరారు. మరోసారి మోసపోయి జగన్ మాయమాటను నమ్మవద్దని ఆయన అన్నారు. జగన్ చెప్పేవన్నీ ఫేక్ వార్తలని చంద్రబాబు అన్నారు. వాటిని నమ్మితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని తెలిపారు.
Next Story