Tue Jan 20 2026 11:40:51 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఎస్పీకి, తమకు ఎలాంటి సంబంధం లేదు : లావు
పల్నాడు ఎస్పీకి తన కుటుంబానికి సంబంధాలు లేవని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు

పల్నాడు ఎస్పీకి తన కుటుంబానికి సంబంధాలు లేవని టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను పోలింగ్ రోజున హింస ప్రేరేపించినట్లుగా వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. పెద్దయెత్తున పోలింగ్ జరగడంతో పాటు పోలింగ్ శాతం పెరగడం వల్ల వైసీపీ నేతలు ఫ్రస్టేషన్ కు గురవుతున్నారన్నారు. తమ కుటుంబంతో ఎస్పీకి సంబంధాలున్న వార్తలు కూడా అవాస్తవమేనని అన్నారు.
కసితో పోలింగ్..
ఒకే కులం అయినంత మాత్రాన కుటుంబ సంబంధాలుంటాయా? అని లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. తనపైనే దొండపాడు గ్రామంలో దాడి జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సిట్ కు తాను పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణలపై అన్ని వివరాలను అందించానని తెలిపారు. పల్నాడు ఓటర్లలో కసి ఉండబట్టే 86 శాతం పోలింగ్ జరిగిందని, ఇది ప్రభుత్వ వ్యతిరేకంగా జరిగే పోలింగ్ అని భావించి వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారన్నారు. ఫలితాలకు ముందే తాను చెబుతున్నానని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు
Next Story

