Wed Dec 17 2025 14:13:32 GMT+0000 (Coordinated Universal Time)
కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వైసీీపీ అభ్యర్థి
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు విజయం దిశగా పయనిస్తున్నారు.

ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు విజయం దిశగా పయనిస్తున్నారు. ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి ఆయన పదిహేడు వేల ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. మరో మూడు రౌండ్ల ఓట్లు మాత్రమే లెక్కించాల్సి ఉంది. అయితే వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
బాలకృష్ణ కామెంట్స్...
వైసీపీ పతనం ప్రారంభమయిందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇది వచ్చే సార్వత్రిక ఎన్నికల విజయానికి సంకేతమని ఆయన తెలిపారు. ఈఎన్నికలు రానున్న ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని చెప్పారు. టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
Next Story

