Fri Mar 13 2026 14:57:43 GMT+0530 (India Standard Time)
Chandrababu : టీడీపీ క్యాడర్ కు గుడ్ న్యూస్...చంద్రబాబు రెడీ అయ్యారట
తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు

తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లవుతున్న నేపథ్యంలో క్యాడర్ నుంచి పెల్లుబుకుతున్న అసంతృప్తి చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో పార్టీకి కార్యకర్తలు ఎంత ముఖ్యమో గుర్తించిన చంద్రబాబు వారిలో ఉన్న అసంతృప్తిని తొలగించాలని నిర్ణయించారు. మంత్రులతో కూడా ఈ విషయంపై చర్చించారు. ఎందుకీ పరిస్థితి వచ్చింది? ఎమ్మెల్యేలు క్యాడర్ ను ఎందుకు దూరంగా పెడుతున్నారు? అధికారంలోకి రావడానికి కారణయిన వారిని విస్మరిస్తే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది.
అసంతృప్తి ఉండటంతో...
తెలుగుదేశం క్యాడర్ ఆత్మాభిమానం తో ఉన్నవాళ్లు. పలకరిస్తేనో, పట్టించుకుంటేనో, చాలు అనుకుంటారు. వైసీపీ నుంచి గత ఎన్నికల ముందు వచ్చిన క్యాడర్ ని ఎమ్మెల్యేలు దగ్గరకు తీసుకుంటున్నారు. అసలు.. సిసలైన క్యాడర్ ను పట్టించుకోవడం లేదు.వారిని టీడీపీ క్యాడర్ గా చుడొద్దని, అక్కడలాగే జరగాలని వాళ్ళే కోరుకుంటారని సిసలైన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీరు క్యాడర్ కి ఏదో చేసేస్తారు అని ? ఉద్ధరించేస్తారు అని ఎప్పడు కలలు కనలేదని, చేసినా,చెయ్యకపోయినా, ఎలక్షన్స్ వచ్చేసరికి పార్టీ కే కట్టుబడి పనిచేస్తారని అంటూ పోస్టులు వైరల్ కావడంతో చంద్రబాబు కూడా దీనిపై ఫోకస్ పెట్టారు.
పార్టీ కార్యాలయానికి పిలిచి...
టీడీపీ ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పార్టీలోని కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఆర్థికంగా నష్టపోయారని, అటువంటి వారిని గుర్తించి ఇప్పటికే పదవులు ఇచ్చామని చంద్రబాబుకు మంత్రి ఒకరు చెప్పారు. అయితే క్యాడర్ లో ఎక్కువ ఆశలు ఉండటంతోనే అసంతృప్తి ఉందని ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుపట్టినట్లు తెలిసింది. వైసీపీ లాగే మనం కూడా వ్యవహరిస్తే ఎలా అనిచంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. ఇక నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన కార్యకర్తలను, ఎమ్మెల్యేలను పార్టీ ఆఫీసుకు పిలిచి వారి మధ్య ఉన్న విభేదాలను కనుక్కొని అక్కడికక్కడే పరిష్కరించి పంపవచ్చని ఒక మంత్రి చేసిన సూచనకు చంద్రబాబు ఓకే చెప్పినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ముఖ్యమైన కార్యకర్తలను పార్టీ కార్యాలయానికి పిలిచివారి మధ్య విభేదాలను తొలగించేందుకు ప్రయత్నాలు చంద్రబాబు మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది.
Next Story

