Sun Mar 08 2026 00:48:57 GMT+0530 (India Standard Time)
TDP : డ్రామాలాడి జగన్ గెలవాలనుకుంటున్నారు
ఎన్నికల కమిషనర్ మీనాను కలిసి టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వినతిపత్రం ఇచ్చారు.

ఎన్నికల కమిషనర్ మీనాను కలిసి టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు వినతిపత్రం ఇచ్చారు. జగన్ పై రాయిదాడి ఘటనపై విచారణను సీబీఐకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేజీ డ్రామా ఆడారని, సానుభూతితో గెలవాలని జగన్ చూస్తున్నారని వారు ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
చంద్రబాబు సీఎం కావడం....
కూటమి సహకారంతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని, టీడీపీ గెలుపు ఖాయమని తెలిసి గులకరాయితో డ్రామా ఆడారని, రాయిదాడి ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కూడా డిమాండ్ చేశారు. అసలు నిందితుడిని పట్టుకుని, రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పాలని ఆయన కోరారు.
Next Story

