Wed Apr 01 2026 06:51:36 GMT+0530 (India Standard Time)
జగన్ రెడ్డి దుర్మార్గపు కొడుకు.. నారా లోకేష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని దోషిగా నిలబెట్టింది జగన్ అని ఆయన అన్నారు. దీనికి గతంలో మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూను షేర్ చేస్తూ లోకేష్ ఈ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారన్నారు.
సుప్రీం కోర్టుకు వెళ్లి....
రాజశేఖర్ రెడ్డి ఆయన మంత్రివర్గం కలసి చేసిన తప్పుు అని, తనకు ఏం సంబంధం అని జగన్ సుప్రీంకోర్టులో ప్రశ్నించారని నారా లోేకేష్ తెలిపారు. దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు అని, అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి వైఎస్ ను ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి అని లోకేష్ అన్నారు. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం లేదని, పక్కా ఆధారాలతో బయటపెడుతున్నానని లోకేష్ తెలిపారు.
Next Story

