TDP : యాక్షన్ లోకి దిగాల్సిందే.. ఇక ఉపేక్షిస్తే అసలుకే ఎసరు.. హైకమాండ్ నిర్ణయం
తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారానికి ఎండ్ కార్డు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి

తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారానికి ఎండ్ కార్డు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే నాయకత్వం నుంచిస్సష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిల మధ్య వార్ మరింత ముదిరింది. కొలికపూడి పార్టీ పరువును మరింతగా బజారున పడేస్తుండటంతో ఇక యాక్షన్ తీసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటి వరకూ అనేక రకాలుగా ప్రయత్నించిన పార్టీ నాయకత్వం ఇక చర్యలు తీసుకోకపోతే కొలికపూడి ఎఫెక్ట్ రాష్ట్రమంతటా పడే అవకాశాలున్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే కొలికపూడి శ్రీనివాసరావుపై వేటు పడే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. దానికి అనుగుణంగానే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా సంకేతాలు ఇచ్చినట్లయింది.

