Fri Dec 05 2025 14:30:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పై నివేదిక
స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టాస్క్ ఫోర్స్ నివేదిక ఇవ్వనుంది

స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టాస్క్ ఫోర్స్ నివేదిక ఇవ్వనుంది. స్వర్ణాంధ్ర సాధన దిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు తీసుకోవాల్సిన అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదక మేరకు చర్యలు తీసుకుంటారు.
చంద్రశేఖరన్ నేతృత్వంలో...
టాటా సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. చంద్రశేఖరన్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధిపై టాస్క్ ఫోర్స్ నివేదిక రూపొందించింది. ఢిల్లీలో సాయంత్రం సీఐఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నివేదిక అందజేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చంద్రశేఖరన్ నివేదిక అందజేయనున్నారు.
Next Story

