Wed Mar 18 2026 22:25:41 GMT+0530 (India Standard Time)
బెంగళూరుకు తారకరత్న తరలింపు
కుప్పం లోనీ పీఈఎస్ ఆసుపత్రి నుంచి తారకరత్నను బెంగళూరుకు తరలిస్తున్నారు.

కుప్పం లోనీ పీఈఎస్ ఆసుపత్రి నుంచి తారకరత్నను బెంగళూరుకు తరలిస్తున్నారు. ప్రత్యేక అంబులెన్స్ లో ఆయనను మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అంబులెన్స్ లో గ్రీన్ ఛానల్ ద్వారా తారకరత్నను బెంగళూరుకు తరలిస్తామని చెప్పారు. ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో లేనందున రోడ్డు మార్గానే తీసుకువెళ్లనున్నామని తెలిపారు.
నిలకడగానే ఉన్నా...
తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయినట్లు ఏంజియోగ్రామ్ లో బయటపడిందని చెప్పారు. మిగిలని రిపోర్టు అన్నీ బాగున్నాయని బాలకృష్ణ తెలిపారు. చంద్రబాబు ఎప్పటికప్పుడు బాలకృష్ణతో పాటు డాక్టర్లకు ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Next Story

