Thu Mar 19 2026 22:32:51 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేపథ్యమయినా....?
తానేటి వనిత. గత జగన్ మంత్రి వర్గంలోనూ ఆమె పనిచేశారు. రాజకీయాలు మొదలు పెట్టింది మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి

తానేటి వనిత.. గత జగన్ మంత్రి వర్గంలోనూ ఆమె పనిచేశారు. రాజకీయాలు మొదలు పెట్టింది మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి. గోపాలపురం ఎమ్మెల్యేగా గెలిచిన బాబాజీ రావు కుమార్తె గా తానేటి వనిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కొవ్వూరు లో ఆమె తన పట్టును నిరూపించుకున్నారు. 2013లో వైసీపీలో చేరారు. 2014లో ఓటమి పాలయినా, 2019 లో గెలిచి జగన్ తొలి మంత్రివర్గంలోనే స్థానం సంపాదించుకున్నారు. జగన్ తొలి మంత్రి వర్గంలో మహిళ, శిశు సంక్షేమ శాఖకు పనిచేశారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా తానేటి వనితకు రెండోసారి జగన్ రెన్యువల్ చేశారు. తిరిగి అదే శాఖను అప్పగించే ఛాన్స్ ఉంది.
Next Story

