Thu Mar 19 2026 07:27:31 GMT+0530 (India Standard Time)
జగన్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
తమిళనాడు ముఖ్యమంత్రి ఏకే స్టాలిన్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు

తమిళనాడు ముఖ్యమంత్రి ఏకే స్టాలిన్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఆనకట్టల నిర్మించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా ఆనకట్టల నిర్మాణం ఎలా చేపడతారని ఆయన లేఖలో ప్రశ్నించారు.
రెండు ఆనకట్టలు...
కోసస్తల నదిపై రెండు ఆనకట్టల నిర్మాణం జరుగుతుందని స్టాలిన్ లేఖలో ఆరోపించారు. రెండు ఆనకట్టల నిర్మాణం జరిగితే చెన్నైలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని స్టాలిన్ జగన్ కు రాసి లేఖలో కోరారు. నదీ పరీవాహక ప్రాంతంలోనూ భవిష్యత్ లో ఆనకట్ట నిర్మించ వద్దని ఆయన లేఖలో కోరారు. వెంటనే ఆనకట్టల నిర్మాణం ఆపాలని ఆయన కోరారు. నదీ పరివాహక ప్రాంతంలో ఆనకట్టలు భవిష్యత్ లోనూ నిర్మించ వద్దని ఆయన లేఖలో సూచించారు.
Next Story

