Fri Mar 20 2026 05:13:15 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ ఏమంటున్నారంటే?
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ప్రారంభించారు

తిరుమలలో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ప్రారంభించారు. తిరుమల ప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్నదానం నాణ్యత ఎలా ఉంది అన్న దానిపై ప్రధానంగా భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
తిరుమల ఈవో శ్యామలరావు...
ఈరోజు తిరుమల ఈవో శ్యామలరావు ఈరోజు స్వయంగా భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. గ్యాలరీలో ఉన్న భక్తుల వద్దకు వెళ్లి మరీ ఆయన తిరుమలలో ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నారా? ప్రసాదం నాణ్యత ఎలా ఉంది? అన్నప్రసాదం బాగుందా? ఎక్కడైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా? అన్న దానిపై ఈవో శ్యామలరావు ఆరా తీశారు. భక్తులు సానుకూలంగా స్పందించారు. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ నిరంతరం కొనసాగుతుందని ఈవో శ్యామలరావు తెలిపారు.
Next Story

