Sun Mar 15 2026 12:37:07 GMT+0530 (India Standard Time)
అక్రమ కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తాం : కేతిరెడ్డి పెద్దిరెడ్డి
తాడిపత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం ఎస్పీని కలిశారు

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం ఎస్పీని కలిశారు. తాడిపత్రి అల్లర్లతో వైసీపీ నేతలకు సంబంధం లేదని తెలిపారు. కేసులు నమోదు చేయవద్దని పెద్దారెడ్డి ఈ సందర్బంగా ఎస్పీని కోరారు. కౌంటింగ్ సమయంలో కార్యకర్తలను భయభ్రాంతులు చేసే విధంగా కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
బాధ్యులైన వారిపైనే...
దీనిని జిల్లా ఎస్పీగా మీరు అడ్డుకోవాలని ఆయన కోరారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తామని పెద్దారెడ్డి తెలిపారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేస్తే ఫ్యాక్షన్ ను ప్రేరేపించినట్టు అవుతుందని కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. అల్లర్లకు బాధ్యులైన వారిపై మాత్రమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Next Story

