Tue Mar 17 2026 11:25:15 GMT+0530 (India Standard Time)
తాడిపత్రిలో టెన్షన్
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. దీంతో టెన్షన్ నెలకొంది

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు గృహనిర్భంధం చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక లారీలను, ట్రాలీలు వస్తే అడ్డుకుంటానని జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు. అవసరమైతే ఇసుక ట్రాక్టర్లను కాల్చి వేస్తానని కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.
జేసీ ముందస్తు అరెస్ట్....
ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో జేసీ అనుచరులు పెద్దయెత్తున అక్కడకకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమ నేతను వెంటనే ఇంటి నుంచి బయటకు పంపాలని వారు కోరుతున్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా తాను పోలీసుల ఆంక్షలను దాటుకుని బయటకు వస్తానని చెబుతున్నారు. దీంతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

