Fri Apr 26 2024 11:05:11 GMT+0000 (Coordinated Universal Time)
కలెక్టర్ కార్యాలయంలో జేసీ హల్ చల్
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో హడావిడి చేశారు
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో హడావిడి చేశారు. కలెక్టర్ టేబుల్ పై భూమికి సంబంధించిన పత్రాలను విసిరేశారు. కలెక్టర్ నాగలక్ష్మితో వాగ్వాదానికి దిగారు. అడ్డుకున్న సిబ్బందితోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదానికి దిగడమే కాకుండా కొంత హల్ చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యేను తననే పొమ్మంటావా? అంటూ విరుచుకుపడ్డారు.
సజ్జలదిన్నె భూములకు...
సజ్జలదిన్నె భూములకు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించాలని ఆయన కలెక్టర్ ను కోరారు. అందరూ కలెక్టర్లు కాలేరని, దేవుడు మీకు అవకాశామిచ్చారని, న్యాయం చేయాలని తొలుత కోరిన జేసీ ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ చూస్తానని చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే సజ్జలదిన్నె భూములను కాజేయాలని చూస్తున్నారన్నారు.
Next Story