Sun Mar 15 2026 11:13:22 GMT+0530 (India Standard Time)
ఈ ఎన్నికలు మాకు లైఫ్ అండ్ డెత్
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలు తమకు లైఫ్ అండ్ డెత్ వంటివని ఆయన అన్నారు. జిల్లా పోలీస్ సూపరింటెండ్ ను కలసి జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై పెట్టిన కేసులు పూర్తి కావాలంటే మూడు తరాలు పడుతుందని ఆయన అన్నారు.
దొంగ ఓట్లతో...
పుట్లూరు, యల్లనూరులో అధికంగా దొంగ ఓట్లు చేర్పించారని ఆయన ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. తమపై ఎన్ని కేసుులె పెట్టినా వెనక్కు తగ్గేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకోవడం అవివేకమని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

