Thu Mar 19 2026 19:57:56 GMT+0530 (India Standard Time)
జేసీ మరో సారి సంచలన వ్యాఖ్యలు.. ఆటోలను బ్యాన్ చేయాలంటూ
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటోలను నిషేధించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గార్లదిన్నె వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. త్రీ వీలర్ ఆటోలను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి...
అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించిన సంఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించడంతో పాటు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పై స్పందించకపోతే రేపు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించడం చర్చనీయాంశమైంది.
Next Story

