Tue Mar 17 2026 07:11:42 GMT+0530 (India Standard Time)
జేసీ మరోసారి వార్నింగ్
కడప ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదంతో తనకు సంబంధం లేదని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు

కడప ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదంతో తనకు సంబంధం లేదని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాను చంద్రబాబు అంత మంచి వాడిని కాదని ఆయన తెలిపారు. వైసీపీ నేతలు పారేసుకుంటే జాగ్రత్త అని జేసీ వార్నింగ్ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసీపీ నేతలు దారుణంగా వేధించారని ఆయన గుర్తు చేశారు.
కేతిరెడ్డిని తరిమికొడతా...
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లను విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. కేతిరెడ్డి సంగతి త్వరలోనే తెలుస్తానని ఆయన మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అనంత వెంకట్రామిరెడ్డిని ఊరినుంచి తరిమేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కడప ఫ్లైయాష్ వివాదాన్ని చంద్రబాబు పరిష్కరిస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
Next Story

