Thu Jul 17 2025 00:11:21 GMT+0000 (Coordinated Universal Time)
JC Prabhakar Reddy : వైసీపీ నేతల్లారా .. ఇప్పుడు తంతే మీకెవరు దిక్కు?
వైసీపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ల పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతారా? ఆయన చాలా మంచోడని చెప్పారు. సీఎంకు చేతకాక కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చూస్తున్నారని, లోకేష్ యాత్ర పెడితే అడ్డుకోవడమే కాకుండా మాట్లాడకుండా మైక్‌లు కూడా లాక్కున్నారన్న విషయాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. వైసీపీ నేతలు మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మీరు పుణ్యాత్ముల అని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రివెంజ్ అనేది లేదు ఉంటే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
ఇంకా నాలుగేళ్లు ఉందంటూ...
మేము వస్తే మేము అంటున్నారు... మిమ్మల్ని ఇప్పుడే తంతే మీకు ఎవరు దిక్కు అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. వైసీపీ వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళు ఏమి చేస్తున్నారని అన్నారు. దేవినేని అవినాష్ నువ్వు గాలి వస్తే పోయేలా ఉన్నావ్ నువ్వు కూడా మాట్లాడతావా అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీకి జనం వస్తున్నారు అంటున్నారు దమ్ముంటే తాడిపత్రికి రమ్మనండి చూద్దామన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్లకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక పిలుపు నిచ్చారు. ఇప్పుడే కొట్టండని, ఇంకా నాలుగేళ్లు ఉంది చూద్దాం అని అన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జైలు బాగా చూసుకోండి అంటున్నాడని, మిమ్మల్ని ఇప్పుడే కొడితే ఎవరేం చేస్తారో చూస్తామని హెచ్చరించారు. . చంద్రబాబు లా అండ్ ఆర్డర్ కోసమే మౌనంగా ఉంటున్నారని, చంద్రబాబు 30 రోజులు మమ్మల్ని ఫ్రీగా వదిలేస్తే ఒక్కొక్కరి అంతుచూస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Next Story