Wed Jul 16 2025 23:02:49 GMT+0000 (Coordinated Universal Time)
ఆటో డ్రైవర్లకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
ఆటో డ్రైవర్లపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

ఆటో డ్రైవర్లపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ సీటులో ప్యాసింజర్లు ఉండకూడదని ఆయన అన్నారు. ప్యాసింజర్లను ముందర సీటులో కూర్చోబెట్టుకుంటే డ్రైవర్లను ఆర్టీవోకు పట్టిస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. అది ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు.
ప్రాణాలు పోతే...
ఆటో డ్రైవర్లు కష్టం చేసుకుని బతుకుతున్నారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్లు కూడా బతకాలన్న ఉద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇక డ్రైవర్ సీట్లో ప్రయాణికులను కూర్చోబెట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అందరి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
Next Story