Thu Jan 29 2026 02:40:34 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఇంకెంతమందిని వేధిస్తారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇకెంతమందిని వేధిస్తారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇకెంతమందిని వేధిస్తారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత కక్షతోనే ఆయన సినిమా భీమ్లా నాయక్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్నారు. ఆంక్షల వల్ల పవన్ కు ఏమీ కాదని, నష్టపోయేది నిర్మాత మాత్రమేననిజేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమల సమస్యల పరిష్కారం కోసం జగన్ వద్దకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టడం, వేడుకోవడం తనను బాధించిందని అని అన్నారు.
కక్ష గట్టి....
పవన్ కల్యాణ్ పై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. పవన్ ను ఏం చేయలేక సినిమా రంగంపై జగన్ పడినట్లుందని జేసీ ఎద్దేవా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్ల ధరలను ఎందుకు పెంచుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు. పేదలు తిరుమలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా టిక్కెట్లు, సేవల ధరలను పెంచుతున్నట్లుందని జేసీ అన్నారు. ధరల పెంపు ఆలోచనను ఉపసంహరించుకోవాలన్నారు.
Next Story

