Fri Dec 05 2025 22:13:53 GMT+0000 (Coordinated Universal Time)
Tadipathri : తాడిపత్రిలో మరోసారి టెన్షన్.. టెన్షన్
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ స్థలం ఆక్రమించారని కూల్చివేయడానికి మున్సిపల్ సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు

తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని మున్సిపల్ స్థలం ఆక్రమించారని కూల్చివేయడానికి మున్సిపల్ సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. తిమ్మపల్లిలో ఉన్న పెద్దారెడ్డికి ఈ విషయం తెలియడంతో ఆయన తాడిపత్రికి బయలుదేరడంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. తాము బందోబస్తును ఏర్పాటు చేసుకునేంత వరకూ తాడిపత్రికి రావద్దంటూ పోలీసులు సమాచారం అందించారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని...
దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒక తోటలో ఉన్నారని సమాచారం. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తాడిపత్రికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలు ఇళ్లవద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పెద్దయెత్తున రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు తాడిపత్రికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story

