Fri Jan 30 2026 04:47:11 GMT+0000 (Coordinated Universal Time)
కొన్ని తప్పుల వల్లనే జగన్ ఓటమి : స్వరూపానందేంద్ర స్వామి
విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామి వాయిస్ ఛేంజ్ చేశారు.

విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామి వాయిస్ ఛేంజ్ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం అద్భుతంగా ఉందన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా శారదాపీఠం అనుగ్రహం ఉంటుందని తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని తెలిపారు. తెలిసింది తెలిసినట్లు చెప్పినట్లు మాట్లాడటమే తమకు తెలిసిందన్నారు స్వరూపానందేంద్ర. జగన్ చేసిన కొన్ని తప్పుల కారణంగానే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎర్రన్నాయుడు కుటుంబంతో...
చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని బాగా పాలిస్తారని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కూడా వేగంగా పూర్తవుతుందని ఆయన అన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కావడం శుభపరిణామమని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తూ ముందుకు సాగుతుందని ఆయన ఆకాంక్షించారు.
Next Story

