Tue Mar 17 2026 00:56:23 GMT+0530 (India Standard Time)
నేడు, రేపు ఏపీలో వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపటికి బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రేపటికి బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈ నెల 22 ఉదయం వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్వ దిశగా ప్రయాణిస్తుందని తెలిపింది. అనంతరం తుపానుగా మారుతుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
65 కి.మీ వేగంతో...
కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి, మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రతీరంలో రేపు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 21, 22 తేదీలలో 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
Next Story

