Fri Jan 30 2026 11:44:39 GMT+0000 (Coordinated Universal Time)
Ys viveka : సుప్రీంకోర్టులో నేడు విచారణ
సుప్రీంకోర్టులో ఈరోజు వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటీషన్‌ను మరోసారి విచారించనుంది

సుప్రీంకోర్టులో ఈరోజు వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటీషన్‌ను మరోసారి విచారించనుంది. ఈ నెల 24వ తేదీ వరకూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు నేడు మరోసారి విచారణ జరగనుంది. నేడు అవినాష్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలను వినిపించనున్నారు.
సునీత పిటీషన్‌పై...
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుండటంతో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. తెలంగాణ హైకోర్టులో కూడా రేపటితో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ విధించిన గడువు ముగియనుంది. రేపు తెలంగాణ హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.
Next Story

