Fri Mar 20 2026 23:22:22 GMT+0530 (India Standard Time)
సుప్రీంకోర్టులో నేడు ఓటుకు నోటు కేసు
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటీషన్ పై విచారణ జరగనుంది.

సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటీషన్ పై విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేశన్ ధర్మాసనం నేడు విచారించనుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది.
సీబీఐకి అప్పగించాలని...
అలాగే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. అయితే ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఓటుకు నోటు కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తే టీడీపీకి ఇబ్బందులు ఎదురవుతాయి. అదే సమయంలో తిరస్కరిస్తే ఊరటదక్కినట్లవుతుంది.
Next Story

