Fri Jan 30 2026 11:02:48 GMT+0000 (Coordinated Universal Time)
నటుడు బాలకృష్ణకు సుప్రీం నోటీసులు
హీరో బాలకృష్ణతో పాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది

హీరో బాలకృష్ణతో పాటు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ తీసుకుని సినిమా టిక్కెట్ ధరలను తగ్గించలేదని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలయింది. పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రజలకు అందించలేదని పిటీషన్ లో పేర్కొన్నారు.
ప్రజలకు ఆ సొమ్మును...
దీనిపై విచారించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సినిమా హీరో బాలకృష్ణతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను సహ ప్రతివాదులుగా చేర్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు రాయితీ ప్రకటించారు.
Next Story

