Mon Mar 23 2026 15:23:21 GMT+0530 (India Standard Time)
Breaking : చంద్రబాబుకు ఊరట
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.

స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. డిసెంబరు11వ తేదీన తిరిగి ఈ కేసును విచారణ చేపట్టనుంది. అయితే కొన్ని షరతులు కూడా విధించింది. చంద్రబాబు రాజకీయ సభలు, కార్కక్రమాల్లో పాల్గొనవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
విచారణ వాయిదా....
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ లు ఇస్తూ ఇచ్చిన తీర్పుపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాము సాక్ష్యాధారాలను సమర్పించినా హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ తెలిపింది. దీనిపై విచారించిన న్యాయస్థానం అప్పటి వరకూ ఈ కేసు గురించి ఎక్కడా మాట్లాడవద్దని తెలిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Next Story

