Wed Mar 18 2026 20:41:12 GMT+0530 (India Standard Time)
అనంతపురానికి చీఫ్ జస్టిస్
ఈ నెల 21 వతేదీన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.

ఈ నెల 21 వతేదీన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. భగవాన్ సత్యసాయి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు జస్టిస్ ఎన్వీరమణ పుట్టపర్తి రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
విశ్వవిద్యాలయంలో....
21వ తేదీన జస్టిస్ ఎన్వీ రమణ విమానంలో బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పుట్టపర్తి విమానాశ్రయానికి వస్తారు. సత్యసాయి నిలయంలో పూజల్లో పాల్గొంటారు. 22వ తేదీన సత్యసాయి విశ్వవిద్యాలయం 40వ స్నాతకోత్సవ సభలో ఎన్వీ రమణ ప్రసంగిస్తారు. అదేరోజు తిరిగి బయలుదేరి వెళతారు.
Next Story

