Sun Mar 22 2026 07:11:42 GMT+0530 (India Standard Time)
నేడు హైకోర్టు నూతన భవనం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు భవనాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించనున్నారు

ఆంధ్రప్రదేశ్ నూతన హైకోర్టు భవనాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ కూడా పాల్గొంటారు. హైకోర్టు తాత్కాలిక భవనం స్థానంలో శాశ్వత నిర్మాణాలను పూర్తి చేశారు. దీనిని ఈరోజు జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభిస్తారు. అనంతరం ఆయన నాగార్జున యూనివర్సిటగీకి వెళతారు అక్కడ ఆయన గౌరవ డాక్టరేట్ ను అందుకుంటారు.
జస్టిస్ ఎన్వీ రమణకు డాక్టరేట్....
జస్టిస్ ఎన్వీ రమణ నాగార్జున యూనివర్సిటీ లా కోర్సులో ఫస్ట్ బ్యాచ్ విద్యార్థి. ఆయన అంచెలంచెలుగా ఎదిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. నాగార్జున యూనివర్సిటీ అధికారులు ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందించనున్నారు. అక్కడి నుంచి మంగళగిరి లోని సీకే కన్వెన్షన్ కు జస్టిస్ ఎన్వీ రమణ చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆతిధ్యాన్ని స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story

