Wed Mar 18 2026 18:58:40 GMT+0530 (India Standard Time)
నేడు తిరుపతికి జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు తిరుపతికి రానున్నారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు తిరుపతికి రానున్నారు. రాత్రికి తిరుపతికి చేరుకోనన్న జస్టిస్ ఎన్వీ రమణ రేపు తిరుపతిలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మహాత్మాగాంధీ ఆత్మకధ సత్యశోధన పుస్తకావిష్కరణ సభలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించనున్నారు. భూమన ఆహ్వానం మేరకే జస్టిస్ రమణ తిరుపతికి వస్తున్నారు.
భూమన ఆహ్వానంతో...
అనంతరం తిరుపతిలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. జస్టిస్ ఎన్వీ రమణ పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 26వ తేదీన జస్టిస్ ఎన్వీరమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని కూడా దర్శించుకునే అవకాశముంది.
Next Story

