Fri Dec 05 2025 14:56:12 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాు. ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాు. ఈరోజు ఉదయం శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. చీఫ్ జస్టిస్ రమణకు వేదపండితులు స్వాగతం పలికారు. పద్మావతి అతిధి గృహంలో బస చేసిన ఎన్వీ రమణకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డిలు స్వాగతం పలికారు. శాలువా కప్పి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను సత్కరించారు.
ప్రత్యేక ప్రదర్శన...
జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల రావడంతో ఆయన పద్మావతి అతిధి గృహంలో పంచగవ్వ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈరోజ మధ్యాహ్నం జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి తిరుచానూరులోని పద్మావతి ఆలయాన్ని సందర్శిస్తారు. ఎన్వీ రమణ తిరుమల పర్యటన సందర్బంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

