Thu Dec 18 2025 23:06:28 GMT+0000 (Coordinated Universal Time)
పాత రోజులు గుర్తుకొస్తున్నాయ్
ఈ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నానని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నాగార్జున యూనివర్సిటీ స్నాతకోత్సవంలోపాల్గొన్నారు.

తాను యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నానని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. నాగార్జున యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ యూనివర్సిటీలో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. తనకు ఇక్కడ ఎంతో మంది స్నేహితులు ఉన్నారన్నారు. క్యాంటిన్ లో గంటల తరబడి చర్చించుకునే వారమని చెప్పారు. లా కళాశాలలో తనకున్నవన్నీ మధుమైన స్మృతులని ఆయన అన్నారు. ఈ యూనివర్సిటీ తనకు తల్లి లాంటిదని ఆయన చెప్పారు. యూనివర్సిటీలో ఏ సమావేశం జరిగినా అన్ని సమావేశాలకు హాజరయ్యే వారమని తెలిపారు. చర్చించకుండా, సమస్యలపై యువతరం స్పందించకపోతే దేశ భవిష్యత్ ఏంటని ఆయన ప్రశ్నించారు.
యువత స్పందిస్తేనే....
యువత అన్ని విషయాలపై చర్చించి స్పందింలాన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు పది కాలం పాటు మనగలగాలంటే స్పందించడం అవసరమని ఆయన అన్నారు. యూనివర్సిటీ కేవలం విజ్ఞాన కేంద్రాలుగానే కాకుండా చైతన్యానికి మరో పేరుగా నిలవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. తాను ఈ స్థాయికి ఎదగడానికి ఎంతోమంది సహకరించారన్నారు. తాను ఇక్కడ లా చదవడానికి కూడా నాగార్జున యూనివర్సిటీ సిబ్బంది కారణమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ఇచ్చింది.
Next Story

