Sat Feb 28 2026 12:37:18 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి ఏపీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యటన
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పర్యటించనున్నారు

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పర్యటించనున్నారు. నేడు తిరుమలకు సీజేఐ సూర్యకాంత్ రానున్నారు. రేపు తిరుపతిలో కోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ భవనంతో పాటు హైకోర్టు అతిథి గృహభవనానికి శంకుస్థాపన చేయనున్నారు.
అమరావతిలో ...
అలాగే అమరావతిలో న్యాయమూర్తుల నివాస గృహాలను ప్రారంభించనున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ రేపు సాయంత్రం విజయవాడలో జరగనున్న ఆర్బిట్రేషన్ సదస్సులో పాల్గొననున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యటనకు వస్తుండటంతో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
Next Story

