Tue Jan 14 2025 05:38:08 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ విచారణ వాయిదా
చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.
![chandrababu naidu, bail cancellation, cbi, supreme court chandrababu naidu, bail cancellation, cbi, supreme court](https://www.telugupost.com/h-upload/2023/11/26/1563877-babu.webp)
చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ఈ కేసును తిరిగి ఫిబ్రవరి 26వ తేదీన విచారణ చేస్తామని తెలిపింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నెల 26వ తేదీన...
అయితే దీనిపై విచారించిన జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను విచారణను వాయిదా వేసింది. తిరిగి ఫిబ్రవరి 26వ తేదీన విచారణ చేపడతామని తెలిపింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Next Story