Mon Apr 06 2026 20:34:46 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం ఆగ్రహం
రాజమండ్రిలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాజమండ్రిలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు చేయడంలో ఆలస్యమెందుకని ప్రశ్నించింది. మీతో కాదంటే చెప్పండి.. సీబీఐకి ఇస్తామని సీరియస్ గా వ్యాఖ్యానించింది. నవంబరు 30వ తేదీ లోగా కేసు ట్రయల్ ను పూర్తి చేయాలని ఆదేశించింది. కేసు ట్రయల్ పూర్తయ్యేంత వరకూ ఎమ్మెల్సీ అనంత బాబుకు బెయిల్ పొడిగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
సీబీఐకి అప్పగించమంటారా?
ఈ హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించింది. రాజమండ్రిలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పోలీసులు నిర్లక్ష్యాన్ని వదిలి కేసు ట్రయల్ పూర్తి చేయాలని ఆదశించింది.
Next Story

