Sun Mar 22 2026 03:57:15 GMT+0530 (India Standard Time)
రాజధాని అమరాతి అంశంపై సుప్రీంకోర్టులో?
అమరావతి అంశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది

రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. స్పెషల్ లీవ్ పిటీషన్ కింద నెంబరు కేటాయించింది. అమరావతి రైతుల సయితం ఈ కేసులో తమ వాదన వినాలని కేవియట్ దాఖలు చేశారు.
శాసన వ్యవస్థలను...
శాసన వ్యవస్థలకు చట్టాలను చేసే అధికారం ఉంటుందని, చట్టాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం సరికాదని ఏపీ ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది. రాష్ట్ర శాసనసభకు ఉన్న ప్రత్యేక అధికారాలను తొక్కేయడమేనని ఏపీ సర్కార్ అభిప్రాయపడింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నెంబరు కేటాయించడంతో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను వినిపించనుంది.
Next Story

