Thu Mar 19 2026 05:25:13 GMT+0530 (India Standard Time)
పవన్ కు పెరుగుతున్న మద్దతు.. స్టయిలిష్ స్టార్ కూడా సపోర్ట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనేక మంది పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. అనేక మంది పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ ను గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చిరంజీవి వీడియో సందేశం ద్వారా పవన్ కల్యాణ్ ను గెలిపించాలని కోరారు. మెగా కాంపౌండ్ లోని హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు పిఠాపురానికి వెళ్లి ప్రచారం చేశారు. రామ్ చరణ్ కూడా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేశారు.
ట్వీట్ ద్వారా తన మద్దతును...
ఇక తాజాగా మెగా కాంపౌండ్ లో ఉండే స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన మామయ్యకు మద్దతుగా నిలిచారు. ప్రచారం చేయకపోయినా ఆయన తన మద్దతు పవన్ కల్యాణ్ కే అంటూ ఆయన ప్రకటించారు. స్టయిలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కు మద్దతు ప్రకటించడంతో ఫ్యాన్స్ మరింతగా పవన్ కల్యాణ్ కు వెంట నడుస్తారని చెబుతున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ "మా ప్రేమ అభిమానం ఎప్పుడు మీతోనే ఉంటాయని అన్నారు. హీరో నాని కూడా పవన్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story

