Thu Mar 19 2026 12:13:19 GMT+0530 (India Standard Time)
వచ్చే నెలలో ఏపీ సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు. మే 24 నుంచి జూన్ 1 మధ్య వీటిని నిర్వహిస్తామన్నారు. సప్లిమెంటరీ రాసే విద్యార్థులు ఫీజును ఈనెల 18 నుంచి 24 వరకు చెల్లించాల్సి ఉంటంుదని అధికారులు వెల్లడించారు.
రీ వెరిఫికేషన్ కు కూడా...
ఈరోజు ఇంటర్ ఫలితాలు విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరీఫికేషన్ కు కూడా ఇంటర్మీడియట్ బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 18 నుంచి 24 వరకు తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మే ఒకటో తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉంటాయని పేర్కొంది.
Next Story

