Sun Mar 22 2026 05:34:34 GMT+0530 (India Standard Time)
తిరుపతిలో సూపర్ స్టార్
తిరుమల వెంకటేశ్వరస్వామిని సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు

తిరుమల వెంకటేశ్వరస్వామిని సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. సుప్రభాత్ సేవలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు ఆయనకు ప్రత్యేక తీర్థ ప్రసాదాలను అందచేశారు. మొక్కులు చెల్లించుకునేందుకు రజనీకాంత్ తిరుమలకు వచ్చారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
రేణిగుంట నుంచి కడపకు...
రజనీకాంత్ వెంట ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. రజనీకాంత్ తిరుమలలో పూజలు చేసుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప అమీన్ పీర్ దర్గాకు కూడా వెళ్లనున్నారు. అక్కడ రజనీకాంత్ కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా రానున్నారని తెలిసింది.
Next Story

