Sun Mar 15 2026 09:20:08 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. మొన్న అసెంబ్లీలో జరిగిన ఘటనపై రజనీకాంత్ ఆరా తీశారు. చంద్రబాబుకు రజనీకాంత్ మద్దతు తెలిపారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరిగి ఉండాల్సింది కాదని రజనీకాంత్ విచారం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ఘటనతో....
రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీలో జరిగిన ఘటనతో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ తో పాటు అన్నాడీఎంకే నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. మైత్రేయన్ ట్విట్టర్ లో కూడా చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.
Next Story

