Sat Mar 07 2026 20:44:51 GMT+0530 (India Standard Time)
గన్నవరం చేరుకున్న రజనీకాంత్
గన్నవరం ఎయిర్‌పోర్టుకు సూపర్ స్టార్ రజనీకాంత్ చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు

గన్నవరం ఎయిర్‌పోర్టుకు సూపర్ స్టార్ రజనీకాంత్ చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు. రజినీకాంత్‌కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకుని రజనీకాంత్‌కు స్వాగతం పలికారు.
ఎన్టీఆర్ శతజయంతి....
ఈరోజు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభకు సూపర్ స్ట్రార్ రజనీకాంత్ హాజరుకానున్నారని ముందుగా ప్రకటించడంతో పెద్దయెత్తున ఆయన అభిమానులు చేరుకున్నారు. అభిమానులను కట్టడి చేయడం పోలీసులకు కష్టంగా మారింది. బాలకృష్ణ రజనీకాంత్‌ను తోడ్కొని ప్రయివేటు హోటల్‌కు వెళ్లిపోయారు.
Next Story

