Tue Mar 17 2026 04:36:34 GMT+0530 (India Standard Time)
బెజవాడకు మహేష్ బాబు
విజయవాడకు సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన ఆయన తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపారు

విజయవాడకు సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన ఆయన తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపారు. సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం మరణించిన వారి అస్థికలను పలు నదుల్లో కలిపితే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందంటారు.
కృష్ణ అస్థికలను....
ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు విజయవాడకు తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. మహేష్ వెంట దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఉండవల్లి సమీపంలోని కృష్ణా నదిలో కృష్ణ అస్థికలను మహేష్ బాబు కలిపారు. పూజారులు సూచించిన మేరకు ఈ క్రియను ఆయన నిర్వహించారు.
Next Story

